బిజినెస్

టమోటో ధరలు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ రాజధాని వాసులకు టమోటో ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ మదర్‌డైరీని ధరలు తగ్గించి విక్రయించాల్సిందిగా బుధవారం ఆదేశించింది. కిలోమీద 2 నుంచి 3 రూపాయలు ధర తగ్గించాలని సూచింది.
ప్రస్తుతం మదర్‌డైరీ నేతృత్వంలో సాగుతున్న విక్రయాల్లో మూడు రకాల టమోటోను రూ. 30, రూ. 40, రూ 55 వంతున విక్రయించడం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మదర్‌డైరీకి 400 రీటెయిల్ ఔట్‌లెట్లు ‘సఫాల్’ పేరిట ఉన్నాయి. కాగా మదర్ డెయిరీతో బాటు కేంద్రీయ బండార్, కార్పొరేటివ్ ఎన్‌సీసీఎఫ్‌లను సైతం ప్రభుత్వం కందిపప్పును కిలోపై రూ. 80నుంచి 85 మధ్య ధరకే విక్రయించాల్సిందిగా ఆదేశించింది. ప్రధాన నిత్యావసర సరకుల ధరలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించిన అనంతరం ఈ ధరల నియంత్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.