బిజినెస్

ఓబీసీ త్రైమాసిక లాభాల్లో 23.5% వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) తాజాత్రైమాసిక లాభాల్లో 23.5 శాతం వృద్ధి నమోదవడంతో ఆ బ్యాంకు వాటాలు బుధవారం 2 శాతం లాభపడ్డాయి. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23.5 శాతం లాభాల వృద్ధితో రూ. 126 కోట్ల నికర లాభాన్ని ఈ బ్యాంకు ఆర్జించింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో వాటా విలువ 2.39 శాతం పెరిగి ఒక్కోవాటా రూ. 51.45 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 2.18 శాతం వృద్ధితో రూ. 51.40గా ట్రేడైంది. బ్యాంకు ఆదాయంలో సైతం 15 శాతం వృద్ధి చోటుచేసుకుని ఈత్రైమాసికంలో మొత్తం రూ.5,702 కోట్లు ఆర్జించింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,967 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా ఈ బ్యాంకు నిరర్థక ఆస్తులను తగ్గించడంలో సఫలమైంది. మొత్తం రుణాలపై నిరర్థక ఆస్తులు 12.53 శాతానికి తగ్గినట్టు ఆ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో నిరర్థక ఆస్తులు 17.24 శాతంగా ఉండేవి.