బిజినెస్

ఆగని ఈ-సిగరెట్ల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ- సిగరెట్లను నిషేధిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అమ్మకాలు ఆగలేదు. ఆన్‌లైన్ అలాగే షాపుల్లోనూ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ-సిగరెట్లను నిషేధిస్తూ గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై వ్యాపారులు, వినియోగదారుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే తప్ప ఫలితం ఉండదని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ఈ- సిగరెట్ల తయారీ, ఎగుమతి, దిగుమతులు, సరఫరా, రవాణా, అమ్మకాలు, నిల్వ, ప్రకటనలను నిషేధిస్తూ సెప్టెంబర్ 18న కేంద్రం ఆర్డినెన్స్ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు లేదా జరిమానా తప్పదని హెచ్చరించారు. ఆంక్షలు ఎప్పుడైతే విధిస్తారో అప్పుడే వ్యాపారులు అక్రమ మార్గాలను అనే్వషిస్తారు. ఈ- సిగరెట్ల విషయంలోనూ అదే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలు జరుగుతుంటాయని నిపుణలు పేర్కొంటున్నారు. ఎందుకు నిషేధించాల్సి వచ్చింది, దాని వల్ల ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని క్లీనికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ముఖుల్ బాజ్‌పాయి సూచించారు. లాభాల కోసం వ్యాపారులు ఎంతకైనా తెగిస్తారని, నిషేధాలు వారికి అడ్డుకాదని ఆయన పేర్కొన్నారు. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం మంచిదే. అదే సమయంలో వినియోగదారుల్లో అవగాహన ముఖ్యం. నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని ఆయన కోరారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నిషేధిత ఉత్పత్తులు విచ్చల విడిగా దొరుగుతున్నాయని, అందులో ఈ-సిగరెట్లు ఒకటని బాజపేయి స్పష్టం చేశారు. పొగతాగి ప్రజలు ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారనే ఉత్పత్తులను నిషేధించినట్టు కేంద్ర వైద్యమంత్రి హర్షవర్దన్ ఇటీవల ప్రకటించారు. పొగాకు ఉత్పత్తుల క్రమబద్ధం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే(జీఏటీఎస్) 2016-17 ప్రకారం భారత్ జనాభాలో కేవలం నాలుగు శాతం మందే పొగ తాగుతున్నారు. మిగిలిన 96 శాతం మంది అందులో అత్యధికులు యువత మాదక ద్రవ్యాలకు, ఈ- సిగరెట్లకు బానిసలుగా మారిపోతున్నారని సర్వే వెల్లడించింది. ఈ- సిగరెట్‌పై యుద్ధం కొనసాగించాల్సిందేనని లక్నోలోని సరస్వతి మెడికల్ కాలేజీ పేథాలజీ ప్రొఫెసర్ రిగ్వర్ధన్ అన్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్(ఈఎన్‌డీఎస్) ఆన్‌లైన్ అలాగే షాపుల్లోనూ దొరుకుతోందని, దీని వల్ల యువత తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.