బిజినెస్

శ్రీసిటీలో పవర్ గ్యాస్ పరిశ్రమ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, సెప్టెంబర్ 8: యుకె దేశానికి చెందిన పవర్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం గురువారం ఉదయం నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్రారంభమైంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి యూనిట్‌గా పవర్ గ్యాస్ గ్రూప్ చైర్మన్ దీపక్ కిల్‌నాని లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫ్రికాదేశాలలో బయోమాస్ ఆధారిత గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు మంచి ఫలితాలు, వృద్ధి సాధించిందన్నారు. ఇందుకు సంబంధించిన విడి భాగాల తయారీ ప్లాంటు ఏర్పాటు ద్వారా తాము భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో దీనిని మరింతగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. కాగా పవర్‌గ్యాస్ నూతన ప్లాంట్‌లో గ్యాసీఫైర్లతో పాటు పవర్ ప్లాంట్ పరికరాలైన హీట్ ఎక్సేంజర్లు, ఎలక్ట్రిక్ ప్యానెల్‌లు, లైట్ ఫ్యాబ్రికేషన్ తదితర పరికరాలు ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ప్రెసిడెంట్ (వర్క్) సతీష్‌కామత్, సెజ్ డెవలెప్‌మెంట్ కమిషనర్, కార్యాలయ ఎస్ ఓ రమణ తదితరులు పాల్గొన్నారు.