బిజినెస్

నేడు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీఎస్‌ఐఐసీ, టీఐఎఫ్, ఎమ్మెస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును శుక్రవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామాత్యులు కల్వకుంట్ల రామారావు ప్రారంభించనున్నారు. పరిశ్రమ అవసరాల కోసం ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సైతం ప్రారంభిస్తారు. పార్కు ప్రారంభోత్సవం అనంతరం పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. పార్కు ప్రారంభోత్సవానికి సంబంధిత ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి రాజమల్లు, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి, టిఫ్ చైర్మన్ సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్, జోనల్ కమిషనర్ శారద, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరిగాయి. ప్రారంభోత్సవానికి పైలాన్‌ను సిద్ధం చేసారు. ఇండస్ట్రియల్ పార్కు వరకు గుట్టలను తొలిచి విశాలమైన రోడ్డు నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1250 ఎకరాల భూమిని సేకరించింది. మొదటి దశలో 450 మంది పారిశ్రామికవేత్తలకు భూమిని కేటాయించారు. సుమారు రూ 1500 కోట్ల వ్యయంతో యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మరికొంత మంది పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రెండవ దశలో వారికి భూమిని కేటాయించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15 వేలు, పరోక్షంగా 19 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానిక నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యతనిచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో దండుమల్కాపురం మహర్దశ వచ్చేసింది. రియల్ రంగానికి కూడా కొత్త ఊపు రాబోతోంది.
*చిత్రం...ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇండస్ట్రియల్ పార్కు పైలాన్