బిజినెస్

సిబ్బంది కోసం బిడ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఔట్‌సోర్సింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. తద్వారా తొలిసారి ఔట్‌సోర్సింగ్‌కు తలుపులు తెరిచింది. కార్యాలయ సిబ్బందితోపాటు సెక్యూరిటీ గార్డుల కోసం బిడ్స్‌ను ఆహ్వానించాలని తీర్మానించినట్టు సమాచారం. ప్రధాన కార్యాలయంలో రిసిప్షనిస్ట్, సూపర్‌వైజర్ తదితర పోస్టులకు ఔట్‌సోర్సింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్నది సెబీ ఆలోచన. సిబ్బందికి, సెక్యూరిటీ గార్డులకు వేర్వేరు నోటీసులను జారీ చేసి, బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నది. కార్యాలయంలో రిసిప్షనిస్టు, డాటా ఆపరేటర్, డ్రైవర్, ఆఫీస్ అసిస్టెంట్, హౌస్ కీపర్ సేవల బాధ్యతను తీసుకోవడానికి ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు మిడ్స్ వేయాల్సిందిగా కోరుతున్నది. అదే విధంగా సెక్యూరిటీ గార్డుల అవసరం కూడా ఉందని మరో నోటీసులో స్పష్టం చేసింది.