బిజినెస్

పుంజుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 8: ఆటో, రియల్టీ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ఆరంభంనుంచి కూడా లాభాల బాటలోనే సాగడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 119 పాయింట్లు లాభపడి 29 వేల పాయింట్లను దాటి 17 నెలల గరిష్ఠస్థాయికి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 34.55 పాయింట్లు లాభపడి 8,952.50 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ఐటి దిగ్గజం టిసిఎస్ భవిష్యత్తు అంచనాలకు సంబంధించి హెచ్చరికల నేపథ్యంలో ఐటి రంగానికి చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. టిసిఎస్ షేరు 5.14 శాతం నష్టపోవడంతో దాని మార్కెట్ విలువ ఏకంగా రూ. 24,798 కోట్లు తగ్గిపోయింది. విప్రో షేరు 1.77 శాతం, ఇన్ఫోసిస్ 1.62, హెచ్‌సిఎల్ టెక్ 1.70, టెక్ మహింద్ర 2.61 శాతం నష్టపోయాయి. అయితే ఆటో రంగం షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. మారుతీ సుజుకి షేరు 2.71 శాతం పెరగ్గా, బజాజ్ ఆటో షేరు 3.55 శాతం పెరిగింది.
గురువారం ఉదయం నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 28,854.56 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అయితే ఆ తర్వాత ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కొద్దిసేపటికే 29,077.28 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకినా చివరికి 118.92 పాయింట్ల లాభంతో 29,045.28 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత ఏడాది ఏప్రిల్ 13 తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. నిఫ్టీ సైతం 34.55 పాయింట్లు లాభపడి 8,952.50 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 22 షేర్లు లాభాలతో ముగియగా, 8మాత్రం నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో సాగాయి.