బిజినెస్

వ్యవసాయ రంగంలో భారత్‌కు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: వ్యవసాయ రంగంలో రెట్టింపు ఆదాయం లభించేలా భారత్‌కు చేయూతనందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి జూలియా క్లొక్నెర్ అన్నారు. శుక్రవారం ఆమె భారత వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చర్చల అనంతరం ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన పత్రాలపై ఇరువురు మంత్రులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జూలియా విలేఖరులతో మాట్లాడుతూ ఐరోపాలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని, భారత్‌లోనూ అదే తరహా ఆదాయం వచ్చేందుకు అవసరమైన సహాయసహకారాలను తాము అందచేస్తిమని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కోతల అనంతరం అనుసరించాల్సిన విధానాలపై జర్మనీకి స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని చెప్పారు. వాటిని అనుసరిస్తే, భారత్‌లోనూ వ్యవసాయ రంగం నుంచి ఆదాయం రెట్టిపు అవుతుందని వ్యాఖ్యానించారు. తోమర్ మాట్లాడుతూ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్టు చెప్పారు. వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. జర్మనీతో భారత్‌కు చిరకాల మిత్రత్వం ఉందని, జూలియా రాకతో ఇది మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు కలసికట్టుగా అభివృద్ధి పథంలో ప్రయాణించడానికి అవసరమైన ఒప్పందాలు కుదిరినట్టు ఆయన వివరించారు.