బిజినెస్

డ్రూప్ చేతికి జెరాఫిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: జెరాఫిన్ ఫినె్వస్ట్‌ను ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెట్ దిగ్గజం డ్రూమ్ ఫైనాన్స్ కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి ఈ ఒప్పందం కుదిరిందనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. గత 12 నెలల కాలంలో డ్రూమ్ క్రెడిట్ పది వేలకుపైగా రుణాలను ప్రాసెస్ చేసింది. ఐడీఎప్‌సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, టాటా కేపిటల్, మణప్పురం ఫైనాన్స్, ఫైర్సెంట్, హీరో ఫిన్‌కార్ప్, కాష్‌కుమార్, లెండ్‌బాక్స్ వంటి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలతో పోటీపడుతూ డ్రూమ్ క్రెడిట్ ఈ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. కాగా, లిజ్విడేషన్‌కు వెళుతున్న జెరాఫిన్‌ను కొనుగోలు చేసి, తన వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవడానికి సిద్ధమైంది. భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడానికి అవసరమైన నెట్‌వర్క్ ఏర్పడుతుందని జెరాఫిన్ కొనుగోలుపై విడుదల చేసిన ఒక ప్రకటనలో డ్రూమ్ వ్యాఖ్యానించింది. వాటాదారులకు అతి తక్కువ రిస్క్‌తో కూడిన వ్యాపారాన్ని అందిస్తున్నామని, అదే సమయంలో భారీ స్థాయిలో రుణాలను ఇవ్వడం ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉంటామని పేర్కొంది. వాటాదారులకు లాభాలు, వినియోగదారులకు మెరుగైన సేవలే విజయ రహస్యంగా అభివర్ణించింది. అయితే, జెరాఫిన్‌ను ఎంత మొత్తానికి కొన్నదనే విషయాన్ని వెల్లడించలేదు.