బిజినెస్

గుర్‌గావ్‌లో రూ. 200 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: గుర్‌గావ్‌లో గృహ నిర్మాణ సముదాయాలను నిర్మించడానికి 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని ప్రముఖ రియాల్టీ సంస్థ ఎంఆర్‌జీ నిర్ణయించింది. సరసరమైన ధరలకే ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో, 22 నుంచి 26 లక్షల రూపాయల మధ్య ఈ ఇళ్ల ధరలను ఖాయం చేస్తామని శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆగ్రో ట్రేడింగ్, విద్యా రంగాల్లో పేరు సంపాదించిన ఎంఆర్‌జీ ఇటీవలే రియాల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని గుర్‌గావ్‌లో 3ది మెరిడియన్2 పేరుతో గృహ సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. 5.5 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 755 యూనిట్లను నిర్మిస్తామని ఎంఆర్‌జీ తన ప్రకటనలో వివరించింది. ఇందుకుగాను 200 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు తెలిపింది. నిర్మాణాలు 2023 సంవత్సరం నాటికి పూర్తవుతాయని అంచనా వేసింది. ఒక్కో యూనిట్‌కు అతి తక్కువగా 21.70 లక్షలు, అత్యధికంగా 25.80 లక్షల రూపాయలుగా ధరను ఖరారు చేసినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి సదుపాయలతో గృహాలను నిర్మించడానికి గుర్‌గావ్ ఎంతో అనువుగా ఉంటుందని తెలిపింది. మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాట్ల ధరలు అసాధ్యంగా ఉన్నాయని, వారు కొనుగోలు చేయలేకపోతున్నారని అభిప్రాయపడింది. ఈ లోటును భర్తీ చేయడానికి, మధ్య తరగతి ప్రజల నుంచి ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. వారికి అందుబాటు ధరల్లోనే ఫ్లాట్ల రేట్లు ఉంటాయని పేర్కొంది.