బిజినెస్

లండన్ ఆస్తులను అమ్మేసిన ఇండియాబుల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇండియాబుల్ భారత మార్కెట్‌ను విస్తరణ, బకాయిల చెల్లింపుల కోసం లండన్‌లోని తన ఆస్తులను అమ్మేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, సాధ్యమైనంత త్వరలో ఒక ప్రమోటర్ గ్రూప్‌కు లండన్ ఆస్తులను 200 మిలియన్ పౌండ్లు (సుమారు 1,830 కోట్ల రూపాయలు)కు విక్రయించాల్సి ఉంది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)కి ఇండడియాబుల్స్ తన ఫైలింగ్‌లో తెలియచేసింది. అప్పటి తీర్మానం మేరకు, లండన్‌లోని హనోవర్ స్క్వేర్‌లోగల ఆస్థులను ప్రమోటర్ గ్రూప్‌కు, అదే మొత్తానికి అమ్మేసింది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న నిర్మాణం ముగింపు దశకు చేరింది. మరో 133 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తే, నిర్మాణాలు పూర్తవుతాయి. అయితే, ఇప్పటికే ఉన్న అప్పులకు మరికొంత భారాన్ని మోయడం కష్టమవుతుందని ఇండియన్‌బుల్స్ వాటాదారులు అభిప్రాయపడ్డారు. అంతేగాక, భారత మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించాలని సెప్టెంబర్ సమావేశంలో తీర్మానించారు. బ్రెగ్జిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ, ఇతరత్రా అంశాలపై ఇంకా స్పష్టత లేకపోవడం, పరిస్థితులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడంతో గ్రేట్ బ్రిటన్‌సహా యూరోపియన్ యూనియన్‌లో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. స్టాక్ మార్కెట్లు పతనం అంచున ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. ఇదే సమయంలో, భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న విస్తృతమైన మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలను ఆకర్షిస్తున్నది. ఇప్పటికే ఇక్కడ వ్యాపారం ఉన్న ఇండియాబుల్స్ సహజంగానే దానిని మరింత విస్తృతం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ముంబయిసహా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. బకాయిల బరువు లేకపోతే, మరింత సులభంగా భారత మార్కెట్లోకి విస్తరించవచ్చన్నది ఈ ఇండియాబుల్స్ ఆలోచన. అందుకే, లండన్‌లోని ఆస్తులను అమ్మేసింది. దీనితో అక్కడ బకాయిలను తీర్చడంతోపాటు, అదనపు పెట్టుబడుల నుంచి బయటపడింది. భారత్‌పై దృష్టి కేంద్రీకరించడానికి అవసరమైన పరిస్థితులను కల్పించుకుంది. ఈ చర్య ఇండియన్‌బుల్స్‌కు ఎంత వరకూ లాభిస్తుందో చూడాలి.