బిజినెస్

పీఎన్‌బీ లుకౌట్ నోటీసు నేపథ్యం.. బన్సాల్ దంపతుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) నేపథ్యంలో, హానుంగ్ టాయిస్ ప్రమోటర్ అశోక్ కుమార్ బన్సాల్, ఆయన భార్య అంజూ బన్సాల్‌ను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హానుంగ్ టాయిస్ అండ్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ సంస్థకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌సహా మొత్తం 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2,300 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చాయి. ఈ మొత్తంలో పీఎన్‌బీ ఇచ్చిన మొత్తం 599 కోట్లు. బకాయిలను చెల్లించడంలో విఫలమైన హానుంగ్ టాయిస్ ప్రమోటర్లు బన్సాల్, ఆయన భార్య అంజూ ఎన్ని నోటీసులు పంపినా స్పందించలేదు. ద దీనితో, గతంలో కొంత మంది ఆర్థిక నేరస్థుల మాదిరిగానే వీరు కూడా దేశాన్ని విడిచి, విదేశాలకు పారిపోతారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ నేపథ్యంలో పీఎన్‌బీ 13 పర్యాయాలు ఎల్‌ఓసీలను విడుదల చేసింది. వీటిలో ఒకటి బన్సాల్ పేరిట కూడా ఉంది. పీఎన్‌బీ నోటుసును దృష్టిలో ఉంచుకొని, విమనాశ్రయంలోని భద్రతాధికారులు ఆదివారం బన్సాల్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తదితరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.