బిజినెస్

వాణిజ్య యుద్ధానికి తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికా, చైనా దేశాల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి త్వరలోనే తెరపడుందా? కనీసం ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందా? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే, ఇది నిజమేనని అనిపిస్తున్నది. ఈనెల రెండోవారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సాంటియాగో (చిలీ)లో సమావేశం కావాల్సి ఉంది. వీరిద్దరూ ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోపరేషన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిపి, ఒప్పందాలు ఖరారు చేసుకుంటారని ఇరు దేశాల అధికారులు తొలుత ప్రకటించారు. అయితే, చిలీలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ట్రంప్, జిన్‌పింగ్ భేటీ అసాధ్యంగా మారింది. చిలీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించలేదు. దీనితో వీరి భేటీ అమెరికాలోని లోవా నగరంలో జరుగుతుందని సమాచారం. ప్రదేశం, తేదీ ఖరారు కాకపోయినప్పటికీ, ఇద్దరు అగ్ర నేతలు భేటీ కావడం, వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం ఖాయమని ఇరు దేశాల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల ఆ రెండు దేశాలు మాత్రమేగాక, ప్రపంచ దేశాలన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. చైనా నుంచి దిగుమతి అవుతున్న పలు వస్తువులపై అమెరికా సుంకాన్ని రెట్టింపు చేయగా, చైనా కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నది. అమెరికా ఆధిపత్యానికి గండికొట్టి, ప్రపంచ మార్కెట్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎగుమతులను ప్రోత్సహిస్తున్నది. అమెరికా మినహా ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై పన్నును గణనీయంగా తగ్గించింది. చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో, అమెరికా తన పట్టును మరింత బిగించింది. ఇటీవలే చైనా నుంచి దిగుమతి అవుతున్న మరో 23 రకాల వస్తువులపై సుంకాన్ని మూడింతలు చేసింది. మొత్తం మీద ఒకరితో మరొకరు పోటీపడుతూ, సుంకాన్ని ఇష్టానుసారంగా పెంచేయడంతో వాణిజ్య యుద్ధం అనివార్యమైంది. రెండు దేశాలు ఆర్థిక దిగ్గజాలు కావడంతో, ప్రపంచ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. చైనా దిగుమతులపై అమెరికా, అదే విధంగా అమెరికా దిగుమతులపై చైనా ఎప్పుడు, ఏ విధంగా స్పందిస్తాయో అర్థంగాక మదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వివిధ దేశాల ఆర్థిక పరిస్థితి గణనీయంగా దెబ్బతిన్నది. భారత్‌సహా అనేకానేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వాణిజ్య యుద్ధం కారణంగా నష్టపోతున్నాయి. అమెరికా, చైనా దేశాలకు కూడా దీని పర్యవసానం ఎలా ఉంటుందో స్పష్టమైంది. అందుకే, సాధ్యమైనంత త్వరలో సమస్యకు తెరదించాలన్న ఆలోచనలో ఉన్నాయి. నేరుగా ట్రంప్‌తోనే చర్చలు జరపాలని, లేకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ సయోధ్య సాధ్యం కాదని చైనా చాలాకాలంగా వాదిస్తూ వచ్చింది.
అయితే, అమెరికా ఇన్నాళ్లూ ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటూ మొండికేసింది. కాగా, ఇప్పుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యేందుకు, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ, ఇరువురు నేతల మధ్య ఒప్పందాలు కుదిరితే, రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఊతం వస్తుంది.