బిజినెస్

రేవులకు సమీపంలో మెగా పార్క్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని జౌళి శాఖ కార్యదర్శి రవి కపూర్ తెలిపారు. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించేందుకు రేవు పట్టణాల సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత మెగా పార్కులను 10కి పైగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడిన ఆయన ఈ మెగా పార్క్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చిందని అన్నారు. ఎగుమతులకు సంబంధించినంతవరకు భారత పోటీతత్వం విషయంలో తీవ్రమైన సందేహాలు ఉన్నాయని, వీటిని అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల భయం కూడా అలుముకుంటోందని, భారత్ ఎగుమతులకు అంతర్జాతీయ పోటీతత్వాన్ని తట్టుకునే నాణ్యత లేదన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయితే, ఏ రకమైన పోటీనైనా తట్టుకునే దేశం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పరిమిత స్థాయిలో అయినా రేవు పట్టణాల సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెగా పార్క్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన పరిశీలనలోకి వచ్చిందని తెలిపారు. వీటిద్వారా ప్రపంచంలో అత్యుత్తమమైన దేశాల ఎగుమతులతో పోటీ పడే రీతిలో భారత్‌ను తీర్చిదిద్దగలుగుతామని అన్నారు.
అయితే, ఇందుకోసం రేవు పట్టణాల సమీపంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మెగా పార్క్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం కలకలం రేపుతుండగా, ఈ నేపథ్యంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అని అనేక దేశాలు యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీని దృష్ట్యా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వౌలిక సదుపాయాలు కలిగిన మెగా పార్క్‌లను రేవు పట్టణాల సమీపంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీఐఐ సమావేశంలో కేంద్ర జౌళి కార్యదర్శి అన్నారు. అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని భారత్ సంతరించుకున్నపుడే ప్రపంచస్థాయిలో ఉత్పాదకతను సాధించగలుగుతుందని, ముఖ్యంగా జౌళి రంగంలో మెగా బ్రాండ్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు.