బిజినెస్

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివిధ కారణాలతో అర్ధంతరంగా ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్ల రూపాయల ఫండ్‌ను కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేట్ రంగానికి చేయూతనిచ్చే క్రమంలో, అంతకు ముందు బడ్జెట్‌లో పేర్కొన్న పన్నులను మినహాయించిన కేంద్రం ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఉద్దీపన పథకాలను ప్రకటించింది. తాజాగా, మరోసారి రియాల్టీపై సీతారామన్ వరాల జల్లు కురిపించారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 25 వేల కోట్ల రూపాయల ఫండ్‌ను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో 10 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వమే నేరుగా విడుదల చేస్తుందని తెలిపారు. ద్రవ్య లభ్యత సమస్య తలెత్తకుండా ఉండేందుకు ‘స్పెషల్ విండో’ ద్వారా రుణ ఆర్థిక సహాయాన్ని అందించి, నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
రియాల్టీ రంగానికి ప్రత్యేకించి గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ స్పెషల్ విండో ద్వారా ఆయా అవసరాలకు నిధులను విడుదల చేస్తామని వివరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్బీఐతో కలసి కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రియాల్టీ రంగం మెరుగుపడితే దేశంలోని మిగతా అన్ని రంగాలకూ ఊతం వస్తుందని ఆమె వివరించారు.

*చిత్రం...కేబినేట్ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్