బిజినెస్

పీఎంసీ స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడిక్కడ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాంకు అవినీతికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిటింగ్ సాగుతోంది. పీఎంసీ సహా దేశంలోని 10 అర్బన్ సహకార బ్యాంకుల్లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఈ బ్యాంకులను గత సెప్టెంబర్ మాసంలో ఆర్బీఐ పరిపాలన పరిధిలోకి చేర్చడం జరిగింది. మొత్తం ఆరు నెలల వరకు ఈ మేరకు ఆ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. మొండి రుణ బకాయిల విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు ప్రధానంగా ఆర్బీఐ ఈ బ్యాంకులపై కనె్నర్ర చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ 3పీఎంసీ స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామ2ని వ్యాఖ్యానించారు. 3అవకతవకలపై నిగ్గుదేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడింటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి2 (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో పాల్గొన్న అనంతరం శక్తికాంత దాస్ విలేఖరులతో మాట్లాడారు. వౌలిక వసతుల సంస్థ హెచ్‌డీఐఎల్‌కు పీఎంసీ నిధుల బదలాయింపు వ్యవహారంలో రూ. 4,355 కోట్లు దుర్వినియోగం అయినట్టు ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పీఎంసీ ఖాతాదారులకు సొమ్ము విత్‌డ్రాల్స్‌పై సైతం ఆర్బీఐ పరిమితిని విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఐతే గురువారం నుంచి ఈ పరిమితికి సంబంధించిన ఆంక్షలను సవరించి రోజుకు రూ. 50వేల వరకు విత్‌డ్రా చేసేలా ఖాతాదారులకు వెసులుబాటు కల్పించినట్టు ఆయన తెలిపారు. ఇలా నాలుగోసారి ఆర్బీఐ ఖాతాదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంక్షలను సడలించినట్టు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్, సారంగ్ వధవాన్ సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కాగా ఈ భారీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సుమారు పదిమంది డిపాజిటర్లు ఆందోళనతో మృత్యువాత పడ్డారు. అలాగే భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.