బిజినెస్

పెరిగిన ఎన్టీపీసీ నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నికర రానం పెరిగింది. సెప్టెంబర్ మాసంతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 3,408.92 కోట్ల రూపాయలని, గతంతో పోలిస్తే ఇది 38 శాతం అధికమని శనివారం బీఎస్‌ఈలో దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఎన్టీపీసీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ నికర లాభం 2,477.28 కోట్ల రూపాయలని తెలిపింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెంతో త్రైమాసికంలో మొత్తం ఆదాయం 26,274.66 కోట్ల రూపాయలుకాగా, గత ఏడాది ఇదే కాలానికి 23,566.65 కోట్ల రూపాయలు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ, ఆరు నెలల కాలంలో నికర లాభం 6,249.20 కోట్ల రూపాయలని, గత ఏడాది ఇది 5,166.24 కోట్ల రూపాయలుగా నమోదైందని ఎన్టీపీసీ వివరించింది. కంపెనీ మొత్తం విలువ 47,715.15 కోట్ల రూపాయల నుంచి రూ.51,546.79 కోట్లకు చేరిందని తెలిపింది. ఇలావుంటే, శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో, నంబియార్ పవర్ జెనెరేటింగ్ కంపెనీ లిమిటెడ్, కాంతి బిజిలీ ఉత్పాదన్ నిజమ్ లిమిటెడ్ కంపెనీలను విలీనం చేసుకునే తీర్మానాన్ని ఆమోదించారు. సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందిన తర్వాత ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుంది.