బిజినెస్

పెయింటర్‌కు పెద్ద బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 10: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో గల చురురు గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ అనే పెయింటర్‌కు భారీ బహుమతి లభించింది. పంజాబ్‌లో నిర్వహించిన లాటరీలో ఆయనను రూ. 2.5 కోట్ల బహుమతి వరించింది. పంజాబ్ స్టేట్ మా లక్ష్మీ దివాలీ-పూజా బంపర్-2019 సంజీవ్ కుమార్ జీవితంలో వెలుగులు నింపింది. ఒక బాలికకు, బాలుడికి తండ్రి అయిన కుమార్ తాను పెయింటర్‌గా, ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటానని చెప్పారు. తాను చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) నుంచి తిరిగి వస్తుండగా నాన్‌గల్ బస్టాండ్ సమీపంలో గల ఒక లాటరీ స్టాల్‌లో రూ. ఒక వెయ్యి పెట్టి రెండు టికెట్లు కొన్నానని ఆయన తెలిపారు. తన కుమారుడికి వైద్య పరీక్షలు చేయించడానికి తాను పీజీఐఎంఈఆర్‌కు వెళ్లానని ఆయన చెప్పారు. తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి భారీ బహుమతి లభించిందని ఆయన తెలిపారు. రెక్కాడితే కాని కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్న కుమార్ ఈ భారీ బహుమతితో తన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయనే విశ్వాసాన్ని ఆదివారం వ్యక్తం చేశారు. తన ఇద్దరు పిల్లల చదువు కోసం ఈ బహుమతి సొమ్మును వినియోగిస్తానని ఆయన తెలిపారు. లూథియానాలో నవంబర్ ఒకటో తేదీన ఈ లాటరీ తీశారు.