బిజినెస్

స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు 70వేల మంది సంసిద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లోని దాదాపు 70 వేలమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపారని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ సోమవారం నాడిక్కడ తెలిపారు. గత వారం వీఆర్‌ఎస్ పథకం అమలులోకి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్ధలోని దాదాపు లక్ష మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉన్నారని తెలిపారు. సంస్థలో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులున్నారన్నారు. 2020 జనవరి 31 నాటికి మొత్తం 77 వేల మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్ పథకాన్ని విర్తింప జేయాలనే లక్ష్యం ఉందని ఇప్పటికే ఆ సంఖ్య 70 వేలకు చేరిందని, ఆ రకంగా చూస్తే మంచి స్పందన వచ్చిందని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు. అలాగే నిర్వహణ, వాణిజ్యం సక్రమంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత కార్పొరేషన్‌ను టెలికాం శాఖ కోరిందన్నారు. ప్రత్యేకించి వీఆర్‌ఎస్ పథకం అమలుతో సిబ్బంది సగానికి తగ్గిపోయే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లోని టెలిఫోన్ ఎక్ఛేంజీల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూడాలని సూచించినట్టు తెలిపారు. ‘బీఎస్‌ఎన్‌ఎల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం-2019’ గత వారం నుంచి ప్రారంభమైందని, ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ డిసెంబర్ 3 వరకు ఓపెన్‌గా ఉంటుందని పుర్వార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేతనాల ఖర్చులో రూ. 7,000 కోట్లు ఆదాచేయాలన్న లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ వీఆర్‌ఎస్‌ను అమల్లోకి తెచ్చిందని, ఇది జరగాలంటే 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌లో వెళ్లాల్సివుందని ఆయన వివరించారు. ఈ పథకం సంస్థ నుంచి ఇతర సంస్థలకు డెప్యుటేషన్‌పై వెళ్లి పనిచేస్తున్న 50 ఏళ్లకు పైబడిన వయసున్న పర్మనెంట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందన్నారు. ఇలా అంగీకారం తెలిపిన 25 సంవత్సరాల సర్వీసు కలిగిన ప్రతి ఉద్యోగికీ సంవత్సరానికి 35 రోజుల వేతనాన్ని ఎక్స్‌గ్రేషియా కింద అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇక మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)లో సైతం ఈ వీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నట్టు పుర్వార్ తెలిపారు. గత నెలలో కేంద్ర కేబినెట్ ఈ వీఆర్‌ఎస్‌కు ఆమోద ముద్ర వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ పరిరక్షణ ప్యాకేజీ కింద ప్రభుత్వం రూ. 20,140 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిందని, ఈ మొత్తాన్ని 4జీ స్పెక్ట్రం కొనుగోలుకు, రూ. 3,674 కోట్ల జీఎస్‌టీ బకాయిల చెల్లింపునకు తదితరాలకు వినియోగించడం జరుగుతుందన్నారు.