బిజినెస్

వ్యవసాయోత్పత్తుల వాణిజ్యానికి ప్రత్యేక సూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిగ్గజ సూచీ ‘నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్చేంజ్ లిమిటెడ్’ (ఎన్‌సీడీఈఎక్స్) ప్రత్యేకంగా రిటర్న్‌ల ఆధారిత వ్యవసాయ అంశాలతో కూడిన సూచీ (ఏజీఆర్‌ఐడీఈఎక్స్)ని బుధవారం ప్రారంభించింది. జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇండిసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో తమ సూచీ పనిచేస్తుందని ఎన్‌సీడీఈఎక్స్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఎన్‌డీఈఎక్స్ వేదికగా జరిగే 10 అత్యధిక ద్రవ్య నిత్యావసర సరకుల వాణిజ్యా కలాపాలను ‘ఎన్‌సీడీఈఎక్స్ ఏజీఆర్‌ఐడీఈఎక్స్ వేదిక’ పరిధిలోకి తెస్తున్నట్టు, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వ్యవసాయోత్పత్తుల వ్యాపారులకు ఈ సూచీ మార్గనిర్దేశంతోప్రభావితం చేస్తుందని అగ్రి ఫ్యూచర్స్ సూచీ, ఎన్‌సీడీఈఎక్స్ ఉప కార్యనిర్వాహక అధ్యక్షుడు కపిల్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. బ్రాడర్ మార్కెట్లో అతికీలక సూచీగా పనిచేయనున్న ఈ సరికొత్త సూచీ వ్యాపారులకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. అలాగే వాణిజ్య అనుకూల ఫ్యూచర్స్ కాంట్రాక్టులను సైతం ఏజీఆర్‌ఐడీఈఎక్స్‌లో ఆరంభిస్తున్నట్టు కపిల్ తెలిపారు. ఇందుకోసం సెబీ అనుమతిని తీసుకుంటామన్నారు. ఈ కాంట్రాక్టులకు సెబీ నిబంధనలకు అనుగుణంగా సొమ్ము ముట్టజెప్పడం జరుగుతుందన్నారు. మదుపర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందజేయడంతోబాటు ఏకీకృత వాణిజ్య విధానం, ఆర్భిటేజీ అవకాశాలపై సహకారం అందజేసేందుకు ఈ సూచీ కృషి చేస్తుందన్నారు. వ్యక్తిగత వాణిజ్యం కంటే ఈ సూచీ పరిధిలో జరిగే నిత్యావసర సరుకుల వాణిజ్యానికి భద్రత ఉంటుందని ఆయన వెల్లడించారు.

*చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్,
టెక్నాలజీస్‌పై జరిగిన సదస్సును ప్రారంభిస్తున్న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్