బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను ఎదుర్కొనే ప్రమాదంలో పడినప్పటికీ, చివరి క్షణాల్లో పెట్టుబడిదారులు షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో కోలుకొని, లాభాలను ఆర్జించాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నంలోగా భారీ పతనం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అనూహ్యంగా పుంజుకున్న సూచీలు ఒకానొక దశలో 322 పాయింట్లు లాభపడ్డాయి. కానీ, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పతనం ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, వివిధ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేయ్యాయి. దీనితో దారుణ పతనం తప్పలేదు. పరిస్థితి అదే రీతిలో కొనసాగితే, బీఎస్‌ఈలో ట్రేడింగ్ భారీ నష్టాల్లో ముగిసి ఉండేది. కానీ, చివరి గంటలో అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి. ఫలితంగా, నష్టాల నుంచి బయపడిన సెనె్సక్స్ క్రమంగా పైకి ఎగబాకింది. చివరికి 170.42 పాయింట్లు (0.42 శాతం) లాభపడి, 40,286.48 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరంభంలో నష్టాలు, ఆతర్వాత లాభాలు, తిరిగి పతనం, చివరిలో కొలుకొని లాషాలను ఆర్జించడం బీఎస్‌ఈలో మాదిరిగానే కొనసాగింది. చివరికి 31.65 పాయింట్లు (0.27 శాతం) మెరుగుపడి, 11,872.10 పాయింట్లుగా నమోదైంది. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలు అత్యధికంగా, 2.67 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ 2.04 శాతం, బజాజ్ ఫిన్ 1.65 శాతం, మారుతి సుజికీ 1.28 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.25 శాతం చొప్పున మెరుగు పడ్డాయి. కాగా, వేదాంత భారీగా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్లు 2.90 శాతం నష్టాలను చవిచూశాయి. ఇండస్‌ఇండ్ 2.79 శాతం, టాటా మోటార్స్ 2.11 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.59 శాతం, ఓఎన్‌జీసీ 1.38 శాతం చొప్పున పతనాలను ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ ఐసీసీఐ బ్యాంక్ షేర్లు లాభాల పంట పండించాయి. 2.90 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ 1.98 శాతం, బజాజ్ ఫిన్ 1.79 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.39 శాతం, మారుతీ సుజికి 1.28 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత భారీగా నష్టపోగా, ఎన్‌ఎస్‌ఈలో ఈ పరిస్థితి భారతి ఇన్‌ఫ్రా ఎదుర్కొంది. ఈ కంపెనీ షేర్లు 3.94 శాతం పతనమయ్యాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.91 శాతం, జీ ఎంటర్‌టైనె్మంట్ 2.72 శాతం, వేదాంత 2.63 శాతం, హిందాల్‌కో 2.56 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.