బిజినెస్

టెలికం రంగానికి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం టెలి కం రంగానికి చెందిన కంపెనీల షే ర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. వొడా ఐడియా, భారతి ఎయిర్‌టెల్ కంపెనీ ల షేర్ల ధర 21.6 శాతం పతనమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఆదాయంలో వాటాను మూడు నెలల్లోగా చెల్లించాలని టెలికం కంపెనీలకు డీఓటీ నోటీసులు జారీ చేయడమే ఈ నష్టానికి కారణని అంటున్నారు. వొడా ఐడియా షేర్ల ధర 21.62 శాతం లేదా 2.90 రూపాయలు పతనమైంది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు ఎన్నడూ ఇంత కనిష్టానికి చేరుకోలేదు. అదే విధంగా భారతి ఎయిర్‌టెల్ షేర్ల ధర 4.88 శాతం లేదా 350.50 రూపాయలు పడిపోయింది. రెవెన్యూ వాటాలను చెల్లించడంలో ఇన్నాళ్లూ తాత్సారం చేసిన టెలికం కంపెనీలు సుప్రీం కోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, మూడు నెలల్లోగా చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులే ఈ రెండు మేటి టెలికం కంపెనీల షేర్ల పతనానికి ప్రధాన కారణమన్నది వాస్తవం.