బిజినెస్

పెరిగిన వేదాంత నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్ల లావాదేవీల్లో గురువారం భారీగానే నష్టపోయిన వేదాంత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పెరగడం విశేషం. బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో నికర లాభం 2,158 కోట్ల రూపాయలు (60.6 శాతం)గా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభం 1,343 కోట్ల రూపాయలు. అయితే, ఏకీకృత ఆదాయం గత ఏడాది ఇదే కాలానికి 23,279 కోట్ల రూపాయలుకాగా, తాజాగా 22,814 కోట్ల రూపాయలకు తగ్గింది. స్థూలంగా చూస్తే, ఆదాయం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, నికర లాభం పెరిగినట్టు వేదాంత స్పష్టం చేసింది. అనుత్పాక ఖర్చులను తగ్గించడం, ఇతరత్రా చర్యల కారణంగా నికర లాభం పెరిగిందని వ్యాఖ్యానించింది.
స్పైస్‌కు ఆరు శాతం నష్టం
స్పైస్ జెట్ షేర్ల ధర గురువారం 5.94 శాతం పతనమైంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 462.60 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రకటించిన నేపథ్యంలో, ఈ కంపెనీ షేర్లు 5.94 శాతం నష్టపోయాయి. 8.99 లక్షల షేర్లు అమ్మకానికి ఉంచగా, ప్రారంభంలో నుంచే నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో 6.94 శాతం లేదా 105.80 శాతం వరకూ పతనమయ్యాయి. కానీ, చివరిలో పరిస్థితి కొంత మెరుగుపడడంతో, నష్టం 106.95 రూపాయలుగా స్థిరపడింది.