బిజినెస్

జీఎస్టీ ఫైలింగ్ గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. జీఎస్టీ ఫైలింగ్ గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం ప్రకటన విడుదల చేసింది. 2017-18 ఆర్థిఖ సంవత్సరానికి సంబంధించిన ఫైలింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకూ దాఖలు చేయవచ్చని అందులో పేర్కొంది. అదే విధంగా 2018-19 ఆర్థిక సంవత్సర జీఎస్టీ ఫైలింగ్ తేదీని వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పెంచినట్టు తెలిపింది. రికన్సిలియేషన్ స్టేట్‌మెంట్ గడువును కూడా సీబీఐసీ పొడిగించింది. జీఎస్టీని ఫైల్ చేయడానికి ఉపయోగించే రెండు ఫామ్స్‌లోని పలు అంశాలను ఐచ్ఛికం చేయడంతో పన్ను చెల్లింపుదారులకు మరింత ఊటర లభిస్తుంది. జీఎస్టీ ఫైలింగ్ సమయంలో తలెత్తుతున్న సమస్యలు, గందరగోళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వివరాలను అందించే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులకే వదిలేయాలని సీబీఐసీ నిర్ణయించింది. వార్షిక రిటర్న్ కోసం జీఎస్‌టీఆర్-9, రికన్సిలియేషన్ రిటర్న్ కోసం జీఎస్‌టీఆర్-9 దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. గతంలో పేర్కొన్న గడువు ప్రకారం 2017-18 ఆర్థిఖ సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఈనెల 30వ తేదీలోగా, అదే విధంగా 2018-19 రిటర్న్స్ డిసెంబర్ 31వ తేదీలోగా సమర్పించాల్సి ఉండింది. అయితే, పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు సీబీఐసీ ప్రకటించింది. అంతేగాక, ఫైలింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యను తొలగించడానికి ఫామ్స్‌ను మరింత సులభతరం చేసినట్టు తెలిపింది. అందులోని పలు వివరాలను వెల్లడించే లేదా దాచిపెట్టే అవకాశాన్ని ఫైలింగ్ చేసే వారికే ఇచ్చినట్టు తెలిపింది.