బిజినెస్

దివాలా ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఆర్థికంగా నష్టపోయి, రుణదాతలకు చెల్లింపులు జరపలేకపోతున్న వివిధ కంపెనీల దివాలా ప్రక్రియపై ఇక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) అభిప్రాయపడింది. ఎస్సార్ స్టీల్ కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఫిక్కీ స్పందిస్తూ, ఇప్పటి వరకూ దివాలా ప్రక్రియలో స్పష్టత ఉండేది కాదని పేర్కొంది. అయితే, జామీను పొందిన, జామీను పొందని రుణదాతలను వేరువేరుగా కాకుండా ఒకే రకంగా చూడాలని, వారికి చెల్లింపులు కూడా ఒకే రీతిలో ఉండాలని నేషనల్ కంపెనీ లా అపిలైట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కకు పెట్టింది. ప్రస్తుతానికి, దివాలా ప్రక్రియలో ఈ తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలపై ఫిక్కీ స్పందిస్తూ, ఇకపై దివాలా ప్రక్రియలో స్పష్టమైన విధానాలు ఉంటాయని అభిప్రాయపడింది.
ప్రత్యేకించి విదేశీ పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన వడ్డీ రేట్లపై ఒక అవగాహన ఉంటుందని వ్యాఖ్యానించింది. గతంలో విదేశీ మదుపరులకు వడ్డీ కింద భారీగా చెల్లింపులు ఉండేవని, ఇక ముందు అందరికీ ఒకే విధానం వర్తిస్తుందని ఫిక్కీ తన ప్రకటనలో తెలిపింది. అదే విధంగా దివాలా ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే రుణదాతల కమిటీ (సీఓసీ)కి వర్తించే విధివిధానాలపై కూడా స్పష్టత వస్తుందని వివరించింది.