బిజినెస్

ఎంఎస్‌ఎంఈ ఎగుమతులు పెంచేందుకు ప్రణాళికలు : గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 16: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎఈ) ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. సూక్ష్మ, చిన్న పరిశమల (ఎస్‌ఎంఈ) సదస్సులో పాల్గొన్న గడ్కరి మాట్లాడుతూ, దేశ వృద్ధిరేటులో 29 శాతం, ఎగుమతుల్లో 48 శాతం ఎంఎస్‌ఎఈ రంగానిదేనని తెలిపారు. అదే విధంగా ఈ రంగంలో 10 నుంచి 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్టు చెప్పారు. ఎగుమతులను పెంచడం ద్వారా, ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని తెలిపారు. ఈ రంగంలో మొత్తం టర్నోవర్ 1,40,000 కోట్ల రూపాయలుకాగా, అందులో సుమారు 90,000 కోట్లరూపాయలు దేశీయ మార్కెట్‌లో జరుగుతున్న లావాదేవీలని, మిగతా మొత్తం ఎగుమతులదని వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే, దేశ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుందని గడ్కరి చెప్పారు.