బిజినెస్

మరో రూ. 35 వేల కోట్ల సమీకరణకు యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) దేశీయ స్టాక్ మార్కెట్ల ద్వారా రూ. 35 వేల కోట్ల నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కీలక నెలల్లోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయింది. తద్వారా వాణిజ్యాభివృద్ధితోబాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి పథకాలకు ఊతమివ్వాలని నాబార్డు భావిస్తోంది. ఇప్పటి వరకు నాబార్డు రూ. 20 వేల కోట్లు సమీకరించిందని, లక్ష్యం మేరకు డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన రూ. 35 వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చైర్మన్ హర్ష్‌కుమార్ బన్వాలా పీటీఐకి తెలిపారు. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అవసరమైన అదనపు బడ్జెటరీ వనరులు (ఈబీఆర్) సమకూర్చుకునేందుకు ఈ విషయంలో ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇప్పటి వరకు నాబార్డు దీర్ఘకాలిక (10 నుంచి 15 సంవత్సరాల కాల వ్యవధి) బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపడుతోంది. ఈక్రమంలో గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 56,069 కోట్లు మార్పు చేయలేని (నాన్ కన్వర్టబుల్) డిబెంచర్ల ద్వారా సమీకరించిందని బన్వాలా తెలిపారు. ఇందులో రూ. 33,169 కోట్లు ప్రభుత్వ పథకాల అమలుకు, మిగిలింది నాబార్డు సంస్థాగత అవసరాలకు కేటాయించినట్టు ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి కృషి సిన్‌చయ్ యోజన వంటి పలు కేంద్ర పథకాలకు నాబార్డు ఆర్థిక చేయూతనిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈక్రమంలో 2018-19లో నాబార్డు పోర్ట్‌పోలియో 22 శాతం వృద్ధిచెంది మొత్తం రూ. 4.32 లక్షల కోట్లకు చేరిందన్నారు. అలాగే గత మార్చి నాటికి బ్యాంకు ఆస్తులు (అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) రూ. 4.87 లక్షల కోట్లకు చేరగా, అప్పటి నుంచి ఈ ఆస్తుల్లో 20 శాతం వృద్ధి చోటుచేసుకుందని బన్వాలా వివరించారు. ఇక నాబార్డు నేతృత్వంలోని స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ ప్రోగ్రాం (ఎస్‌హెచ్‌జీ-బీఎల్‌పీ) అనేక మిలియన్ల మంది గ్రామీణ మహిళలకు లబ్ధిని చేకూర్చిందని, ఈ కార్యక్రమం త్వరలో పూర్తిగా డిజిటల్ వేదిక పరిధిలోకి రానుందని, తద్వారా ఎస్‌హెచ్‌జీల పరిధిలోని మహిళలకు రుణాల మంజూరులో ఓ పెను ఉద్యమంలాంటి సానుకూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఆయన వివరించారు.
*చిత్రం...నాబార్డ్ చైర్మన్ హర్ష్‌కుమార్ బన్వాలా