బిజినెస్

గంటా ఇల్లు వేలం ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: బ్యాంకుకు రుణం ఎగవేతకు పాల్పడినందుకు గాను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఇంటిని వేలం వేసేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ పేరిట గంటా శ్రీనివాసరావు మరో ఏడుగురు ఇండియన్ బ్యాంకు నుంచి రుణం పొందారు. దీనికి గాను వివిధ ప్రాంతాల్లోని తమ ఆస్తులను బ్యాంకుకు తనఖా పెట్టారు. తీసుకున్న రుణానికి వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఈ నెల 6 నాటికి వడ్డీతో కలిపి రుణ బకాయి మొత్తం రూ.208.7 కోట్లకు చేరిందని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. రుణాన్ని చెల్లించాల్సిందిగా గంటా శ్రీనిసరావు సహా మిగిలిన భాగస్వాములకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో చివరిసారిగా గత నెల 4న నోటీసులు జారీ చేసినట్టు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. చివరి నోటీసుకు కూడా స్పందించకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా రుణానికి హామీగా గంటా శ్రీనివాసరావు ఇచ్చిన ఆస్తుల వేలానికి సిద్ధపడ్డట్టు వెల్లడించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్‌ను వేలం వేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వీటితో పాటు ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌లో భాగస్వాములకు సంబంధించిన ఆస్తులను వేలం నోటీసులో ప్రకటించారు. ఈ నెల 20 ఆస్తులను వేలం వేస్తున్నట్టు బ్యాంకు వర్గాలు పత్రికా ప్రకటన జారీ చేశాయి. బ్యాంకులకు రుణ ఎగవేత విషయమై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినట్లు సమాచారం.