బిజినెస్

వాహన ధరలో భాగమే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ధర, అమర్చేందుకు అయ్యే చార్జీలు వాహన కొనుగోలు ధరలో కలిపి ఉంటాయి. కొత్త వాహనాలకు సంబంధించి ఈ ప్లేట్‌ను అమర్చే బాధ్యత ఆయా వాహన డీలర్లేదే. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి లేదా అంతకుముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఆయా వాహనాల తయారీదార్లే డీలర్లకు సరఫరా చేయాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్లేట్ ఖరీదు, అమర్చేందుకు అయ్యే ఖర్చును వాహన కొనుగోలు ధరలో చేర్చాలి. అదనంగా రుసుం వసూలు చేయవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కొత్త వాహనాలకు సంబంధించి డీలర్లే కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్లేటు అమర్చాల్సి ఉంటుంది.