బిజినెస్

5జీతో దేశ ఆర్థ్ధికాభివృద్ధికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే కీలక రంగాల్లో టెలికాం కూడా ఒకటని, 5జీ సాంకేతికతతో ఈశాఖ మరింత బలోపేతం కావడం తథ్యమని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) కార్యదర్శి అన్షుప్రకాష్ పేర్కొన్నారు. ఆసియన్ ట్రాయ్ నేతృత్వంలో సోమవారం నాడిక్కడ ‘ విధాన నియంత్రణ, అభివృద్ధికి సమున్నత సమర్థత, సహేతుక పనితీరు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి దోహదం చేసే హెల్త్‌కేర్, వ్యవసాయం వంటి కీలక రంగాలతో అనుసంధానమై టెలికాం రంగం సమున్నతంగా పనిచేస్తోందన్నారు.
తమ రంగం దేశ పౌరులను సమర్ధవంతం చేయడంలోనూ, మరింత మేలైన పాలనకు, పారదర్శకతకు తోడ్పాటునివ్వడంలోనూ గణనీయమైన కృషి చేస్తోందన్నారు. ఇది ఓ కీలక వౌలిక వసతుల రంగం. దీనిపైనే ఆధారపడి పలు రంగాల మనుగడ సైతం సాగుతోందని, ప్రత్యేకించి డిజిటల్ కనెక్టివిటీ ఓ సమగ్ర భాగస్వామిగా మారిందని, ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోనూ అనుబంధంగా సాగుతూ దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఇదే సభలో పాల్గొన్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ప్రసంగిస్తూ సమాచార, ప్రసార రంగాల్లో సాంకేతికత ప్రస్తుతం కీలకంగా మారిందని, ప్రధానంగా ఇందుకు సంబంధించిన సిస్టం భద్రత, డేటా భద్రత ప్రధానాంశాలుగా మారాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, డేటాప్రైవసీ ప్రధానంగా మరింతగా పెరగాల్సివుందన్నారు. వేగంగా పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో అందుకు అనుగుణమైన న్యాయపరమైన, నియంత్రణ పరమైన వ్యవస్థలు కూడా ఏర్పాటవడం, లేదా ఉన్నవి బలోపేతం కావడం జరగాలని శర్మ సూచించారు. అలా కాకపోతే ప్రగతికి నిరోధం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరిగి సరైన మార్గాల్లో సుహృద్భావ వృద్ధి చోటుచేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తొలుత నియంత్రణకు అనుగుణమైన సదుపాయాల కల్పనపై దృష్టి నిలపాలని ప్రభుత్వానికి సూచించారు.