బిజినెస్

సంక్షోభ పీఎంసీ డిపాజిటర్లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 19: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్, మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకు డిపాజిటర్లకు మరో వెసులుబాటు లభించింది. ఆరోగ్య పరమైన అత్యవసర చికిత్సల కోసం డిపాజిటర్లు రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డిపాజిటర్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నియమించిన బ్యాం కు పాలకుడిని సంప్రదించాలని మంగళవారం ముంబయి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్‌బీఐ తెలిపింది. పీఎంసీ బ్యాంకు ఖా తాదారులు, డిపాజిటర్లు సొమ్ము డ్రా చేసుకునే విషయంలో ఆర్‌బీఐ ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జరిగిన విచారణలో ఆర్‌బీఐ ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు వివరించింది. పెళ్లి, విద్య, జీవన ఖర్చుల వంటి ముఖ్యావసరాలకోసం డ్రా చేసుకునే సొ మ్ముపై తాజాగా పరిమితిని సడలించామని, వీటికోసం రూ. 50 వేల వరకు డిపాజిటర్లు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ కౌనె్సల్ వెంకటేష్ ధోన్డ్ సమున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. జస్టి టస్ ఎస్‌సీ ధర్మాథికారి, జస్టిస్ ఆర్‌ఐ చాగ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా వి చారణ నిర్వహించింది. కాగా బ్యాంకు, దాని డి పాజిటర్లు, ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని రిజర్వు బ్యాంకు తన అఫిడవిట్‌లో ధ ర్మాసనానికి స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో పీఎంసీలో భారీ కుంభకోణం వెలుగుచూడడం తో ఆర్బీఐ జోక్యం చేసుకుని ఆరు నెలలు అమ ల్లో ఉండే వివిధ ఆంక్షలను విధించిన సంగతి తె లిసిందే. ఐతే డిపాజిటర్లను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఆంక్షలను సడలించినట్టు పీఎంసీ తెలిపింది.