బిజినెస్

బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని రూ. 10 లక్షలకు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 19: బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ బీమా పరిమితి గతంలో 1993 మే నెలలో ఏర్పాటు చేశారని, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, తా జాగా పీఎంసీ బ్యాంకు కుంభకోణం వంటివి తలెత్తడంతో డిపాజిటర్లు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని ఆ సంఘాలు గుర్తు చేశాయి. ఈ బీమా పరిమితిని పెంచేందుకు అవసరమైన శాసనాన్ని ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపినప్పటికీ ఎంతమేర పెంచుతారన్న విషయంలో స్పష టత లేదని ఆ సంఘాల నేతలు తెలిపారు. ఓ వ్యక్తికి చెందిన అన్ని డిపాజిట్లకు రూ. 10 లక్షల బీమా వ ర్తింపజేయాలని తాము గతంలోనే ప్రభుత్వానికి వి న్నవించామన్నారు. దాన్ని మళ్లీ గుర్చుచే స్తూ తమ విన్నపాన్ని మన్నించాల్సిందిగా కోరుతున్నామని అఖిల భారత రిజర్వు బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డాలర్ల పరిమితితో పోలిస్తే ఇతర దేశాల్లో అమలులో ఉన్న 14 వేల డాలర లకంటే మన దేశీయ బీమా కవరేజీ చాలా తక్కువని తెలిపారు.