బిజినెస్

పెరిగిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశీయ మార్కెట్లలో బంగారు, వెండి ధరలు మంగళవారం మరోమారు పెరిగాయి. అంతర్జాతీయం మార్కెట్లలో బంగారానికి అంతగా ఆదరణ లేకపోయినా దేశీయ మార్కెట్లో ధరలు పెరిగాయని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ. 38,700 పలికిన 10 గ్రాముల (తులం) బంగారం ధర మంగళవారం రూ. 328 పెరిగి మొత్తం రూ. 39,028 చేరింది. అలాగే 24 కేరట్ల స్పాట్‌గోల్డ్ ధర కూడా రూ. 328 పెరిగింది. ఇక వెండి ధరలు కిలోపై రూ. 748 పెరిగి మొత్తం ధర రూ. 45,873కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సు బంగా రం 1,470 డాలర్ల వంతున ట్రేడవగా, వెండి ధర మాత్రం పెరిగి ఔన్సు 17.10 డాలర్ల వంతున క్రయవిక్రయాలు జరిగాయి. అమెరికా-చైనా మధ్య సా గుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తల క్రమంలో మదుపర్లు స్టాక్ మార్కెట్ల వైపు దృష్టి నిలపడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి అంతగా ఆదరణ లభించలేదని ప్ర ముఖ వాణిజ్య విశే్లషకుడు తపన్ పటేల్ తెలిపారు.