బిజినెస్

జీవితకాల గరిష్టానికి ఆర్‌ఐఎల్ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 19: దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు తోడవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు మంచి లాభాలను సంతరించుకున్నాయి. ప్రధానంగా హెవీవెయిట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 185.51 పాయింట్లు (0.46 శాతం) లాభాపడి 40,544.13 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ ప్యాక్‌లోని 30 స్టాక్స్‌లో 11 స్టాక్స్ లాభపడ్డాయి. బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 55.60 పాయింట్లు (0.47 శాతం) లాభపడి 11,940.10 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 4 శాతం లాభాలను సంతరించుకుంది. ఓ దశలో ఏకంగా రూ. 1,514.95 పలికిన ఈ వాటా ధర ఇంట్రాడేలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ వౌలిక విలువ రూ. 9.5 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి ఇంట్రాడే మార్కెట్ విలువను సంతరించుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గణుతికెక్కింది. ఇక డిసెంబర్ నుంచి మొబైల్ ఫోన్‌కాల్, డేటా చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించిన భారతి ఎయిర్‌టెల్ వాటాలు 7.36 శాతం లాభపడగా, వొడాఫోన్ ఐడియా వాటాలు 34.68 శాతం లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ సైతం లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్ 2.66 శాతం నష్టపోయి సెనె్సక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన కంపెనీగా మిగిలింది. అలాగే ఎం అండ్ ఎం 2.19 శాతం, టాటాస్టీల్ 2.02 శాతం నష్టపోగా, టీసీఎస్, టాటామోటార్స్, హీరోమోటోకార్ప్ సైతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
బలహీనపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరింత బలహీనపడింది. 17 పైసలు నష్టపోయిన రూపాయి ఇంట్రాడేలో 71.86గా ట్రేడైంది. ఇక ఆసియా దేశాల్లో షాంఘై, హాంగ్‌కాంగ్ స్టాక్‌మార్కెట్లు లాభపడగా, టోక్యో, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను సంతరించుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 0.83 శాతం తగ్గి బ్యారెల్ 61.92 డాలర్ల వంతున ట్రేడైంది.