బిజినెస్

శ్రీవారి నిధులు ఇక నుంచి జాతీయ బ్యాంకుల్లోనే జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఇతర మార్గాల్లో టీటీడీకి లభించే నిధులను ఇకపై జాతీయ బ్యాంకుల్లో మాత్రమే జమ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు సమాచారం. అయితే జాతీయ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇస్తున్న నేపథ్యంలో టీటీడీకి రూ. 100 కోట్లు మేర నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రూ. 5కోట్లు మేర టీటీడీ నిధులు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వెసులుబాటును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పాలకమండలి ఆదేశాలతో రూ. 1400 కోట్లు నిధులను సిండికేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నిధులను డిపాజిట్ చేసుకోవడానికి సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలావుండగా టీటీడీ ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే 8.6 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అయితే జాతీయ బ్యాంకుల్లో మాత్రం 6.57 శాతం మాత్రమే చెల్లిస్తోంది. ఈలెక్క ప్రకారం రూ. 100 కోట్లు వడ్డీ టీటీడీ నష్టపోయే అవకాశం ఉంది.