బిజినెస్

అమెరికా ఫిర్యాదులపై డబ్ల్యూటీవో అప్పిలేట్‌లో భారత్ అప్పీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: భారత్ అమలు చేస్తున్న ఎగుమతుల మంజూర్లు, రాయితీలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లే వంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వివాదాల పరిష్కార కమిటీ ఇచ్చిన రూలింగ్‌పై భారత్ బుధవారం అప్పీలుకు వెళ్లింది. అమెరికా ఈ ఆరోపణలను భారత్‌పై గుప్పించి డబ్ల్యుటీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా అమెరికా ఐదు ఆరోపణలు చేసింది. వివిధ భారతీయ పథకాలకు సంబంధించిన సరుకుల ఎగుమతులు (ఎంఈఐఎస్), ఎగుమతుల ఆధారిత యూనిట్లు (ఈ ఓ యూ), ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ టెక్నాలజీ భత్యాలు (ఈహెచ్‌టీపీ), ప్రత్యేక ఆర్థిక జోన్లు (ఎస్‌ఈజెడ్), ఎగుమతి ప్రోత్సాహక కేపిటల్ గూడ్స్ (ఈపీసీజీ)ల విషయంలో భారత్ అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాలను పాటించడం లేదన్నది అమెరికా ఆరోపణ. ఇందువల్ల ఆయా కంపెనీలకు సైతం నష్టం కలుగుతుందని వాదించింది. ఈక్రమంలో డబ్ల్యుటీవో వి వాద పరిష్కారాల కమిటీ అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఈ పథకాల అమలులో నిబంధనలు తుంగలో తొక్కారని, డబ్ల్యూటీవో ఒప్పందానికి వ్యతిరేకంగా భార త్ నిషేదిక ఎగుమతి సబ్సిడీలను అమలు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక గత అక్టోబర్ 31న విడుదలకాగా భారత్ దానిపై తాజాగా డబ్ల్యుటీవో అప్పిలేట్ విభాగంలో అప్పీలు చేసిందని సంబంధిత అధికారి ఒకరు బుధవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఆర్టికల్ 27లోని 3ఆర్గనైజేషన్స్ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్‌వెయిలింగ్ మెజర్స్ (ఎస్‌సీఎం) కింద అమెరికా ఈ వివాదంలోకి భారత్‌ను లాగింది. ఇది భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై డబ్ల్యుటీఓ వివక్ష వహించేందుకు దోహదం చేస్తుందని ఆ అధికారి తెలిపారు. ఈ ఒప్పందం తొలిసారిగా అమలులోకి వచ్చిన సందర్భంగా 1000 డాలర్ల వంతున స్థూల జాతీయ తలసరి ఆదాయం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎనిమిదేళ్లలో ఎగుమతి సబ్సిడీలను తగ్గించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు 2017లో భారత్ మాత్రమే ఎనిమిదేళ్ల వ్యవ ధి ముగియడంతో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమానంగా మరో ఎనిమిదేళ్ల వ్యవధిని ఇవ్వాల్సిందిగా భారత్ డబ్ల్యుటీఓను అభ్యర్థించింది. ఈక్రమంలో అమెరికా చేసిన ఆరోపణలను ఖండించిన భారత్ మొత్తం సంప్రదింపుల తీరును పరిశీలించాల్సిందిగా డబ్ల్యుటీఓ అప్పిలేట్ విభాగానికి తాజా అప్పీలులో విజ్ఞప్తి చేసింది.