బిజినెస్

విదేశాల నుంచి ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: దేశవ్యాప్తంగా ఉల్లి కొరతను అధిగమించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వెల్లడించారు. దిగుమతులతో పాటు స్థానికంగా లభ్యమయ్యే ఉల్లిని కొనుగోలు చేసి పంపిణీ పాయింట్లు, రైతు బజార్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ విషయమై సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల వారీ ఉల్లి లభ్యత, ధరలు,
నిల్వలపై ఆరా తీశారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉల్లిపాయల సరఫరాను పెంపొందించేందుకు చేపట్టిన చర్యలు, ధరల నియంత్రణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. మహారాష్ట్ర నుంచే అధికంగా రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోందని తెలిపారు. కొంత స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఉల్లిని ప్రజలు వినియోగిస్తున్నారని, కొరత కారణంగా ధరలు పెరిగాయన్నారు. రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో పండిస్తున్న ఉల్లి వచ్చే ఏడాది జనవరికి కానీ మార్కెట్‌లోకి రాదని అప్పటికి సమస్య తీరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ లోగా కేంద్రం విదేశాల నుండి దిగుమతి చేసే సరకును రాష్ట్రానికి కొంత సరఫరా చేయాలని కోరారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు నిర్వహించే వ్యాపారులపై నిఘా తీవ్రతరం చేసి విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే దాడులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. సమావేశానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మధుసూదనరెడ్డి, కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు హాజరయ్యారు.
*చిత్రం...వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ నీలం సాహ్ని