బిజినెస్

మళ్లీ లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత మంగళవారం నష్టాల్లోకి జారిన మార్కెట్లు మళ్లీ వారం ఆరంభ రోజున పుంజుకోవడం విశేషం.
రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశంలో ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దే కేంద్ర చర్యలకు ఊతంగా మరోదఫా రెపోరేట్ల కోత విధించవచ్చన్న అంచనాలతో మదుపర్లు సానుకూలంగా స్పందించారని విశే్లకులు భావిస్తున్నారు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 174.84 పాయింట్లు (0.43 శాతం) లాభపడి 40,850.29 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 43.10 పాయింట్లు (0.36 శాతం) లాభపడి 12,037.30 పాయింట్ల ఎగువన స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 7 శాతం లాభపడింది. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంత లిమిటెడ్, టాటాస్టీల్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ సూచీ 1.66 శాతం లాభపడగా, బ్యాంకెక్స్, ఐటీ సూచీలూ అదే బాటలో నడిచాయి. బీఎస్‌ఈలో కేపిటల్ గూడ్స్, ఇంధన సూచీలు అత్యధికంగా నష్టాలపాలయ్యాయి.
నష్టాల్లోనే ఆసియా మార్కెట్లు: తాజా రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఇప్పటిలో ఫలితమిచ్చే అవకాశాలు లేకపోవడంతో మదుపర్లు జాగరూకతను పాంటించడంతో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం నష్టాల పరంపరను సాగించాయి.