బిజినెస్

నష్టాల్లో పీసీ జ్యుయెలర్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పీసీ జ్యుయెలర్ కంపె నీ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. షా ర్ట్, లాంగ్ టెర్మ్ లోన్ల విషయంలో ఈ బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా లేదని క్రిసిల్ తన రేటింగ్‌లో పేర్కోవడంతో పీసీకి నష్టాలు తప్పలేదు. గత 52 వారాల్లో ఎన్నడూ లేనంతగా 23.5 రూపాయలు లేదా 5.05 శాతం ఈ కంపెనీ షేర్లు పతనమయ్యా యి. క్రిసిల్ నివేదిక ఫలితంగానే నష్టాలు తప్పలేదని ఈ కంపెనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. రాబడి వ్యయాలను తగ్గించి, పెట్టుబడులను మరిం త పెంచడం ద్వారా సమస్యకు తెరదించనున్నట్టు తెలిపింది. తన గ్రూప్‌లో ఉన్న ఇతర సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటామని వివరించింది.
జేఎస్‌డబ్ల్యూ కూడా..
పీసీ జ్యుయెలర్స్ మాదిరిగానే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్ల ధర కూడా పతనమైంది. నవంబర్ లో కంపెనీ ఉత్పత్తి 7శాతం పడిపోయిందన్న వార్త ల నేపథ్యంలో షేర్ ధర అనూహ్యంగా తగ్గింది. షే ర్ ధర రూ.254.50 లేదా 1.64 శాతం తగ్గింది. సో మవారం తన నివేదికను వెల్లడించిన జేఎస్‌డబ్ల్యూ, అక్టోబర్‌లో కంపెనీ ఫ్లాస్ట్ ఫర్నేస్‌ను తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్ల ధర పతనం కావడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపింది.