బిజినెస్

మార్కెట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 10: రూపాయి మారకపు విలువ బలపడుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్స క్స్ ఉదయం 40,588.81 పాయింట్లతో బలంగా కనిపించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా పట్టు కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, సెనె్సక్స్ 247.55 పాయింట్లు లేదా 0.61 శాతం పతనమై, 40,239.88 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 80.70 పాయింట్లు లేదా 0.68 శాతం పతనమై, 11,856.80 పాయింట్లుగా నమోదైంది. సెనె్సక్స్‌లో ఎస్ బ్యాంక్ షేర్లు దారుణంగా పడిపోయాయి. 10.05 శాతం నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ 2.66 శాతం, పవర్ గ్రిడ్ 2.64 శాతం, ఎన్‌టీపీసీ 2.53 శాతం, ఐటీసీ 2.47 శాతం చొప్పున నష్టపోయా యి. అయితే, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న బజాజ్ ఫిన్ 1.06 శాతం లాభాలను నమోదు చేసింది. హెచ్‌యూఎల్ 1.05 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.55 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.48 శాతం, బజాజ్ ఆటో 0.32 శాతం చొప్పున లాభాలు సంపాదించాయి. నామమాత్రపు లాభాలే అయినప్పటికీ, నష్టాల బారిన పడకుండా తప్పించుకున్నాయి. కాగా, నిఫ్టీలో సైతం ఎస్ బ్యాంక్ షేర్లకు భారీ నష్టాలు తప్పలేదు. 10.40 శాతం నష్టపోయిన ఈ బ్యాంక్ వాటాలు ఈవారంతంలోగా కోలుకుంటాయా అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది. జీ ఎంటర్‌టైనె్మంట్ 5.10 శాతం, గెయిల్ 4.39 శాతం, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.97 శాతం, బీపీసీఎల్ 2.90 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ బజాజ్ ఫిన్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. వీటి ధర 1.26 శాతం పెరిగింది. హెచ్‌యూఎల్ 1.10 శాతం, సిప్లా 1.09 శతం, ఇచర్ మోటర్స్ 2.01 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.85 శాతం చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి.
అమెరికా డాలర్‌కు రూపాయి మారపు విలువ 11 పైసలు మెరుగుపడడంతో, 70.93 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్ ధరలో 0.33 శాతం పతనం నమోదైంది. రూపాయి విలువ పెరిగితే, సహజంగానే దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడుతుంది. మంగళవారం కూడా అదే జరిగింది. అన్నిటి కంటే ఎస్ బ్యాంక్ దారుణంగా నష్టపోయింది. ఈ బ్యాంక్ బోర్డు సమావేశానికి ముందు షేర్ల ధర పడిపోవడం గమనార్హం. సంస్థలోకి భారీగా నిధులు వస్తున్నట్టు బ్యాంక్ ఇది వరకే ప్రకటించింది. అయితే, బోర్డు సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై రకరకాల ఊహాగానాలు వెలువడడంతో, ఎస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.