బిజినెస్

ముంబయ్ మెట్రో రైలు తయారీని ప్రారంభించిన ఆల్‌స్ట్రాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాలెం, డిసెంబర్ 10: సుస్థిరత స్మార్ట్‌మొబిలిటీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆల్‌స్ట్రాం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ పరిశ్రమలో ముంబయ్ మెట్రోరైలు కార్పొరేషన్ కోసం మెట్రో ట్రెయిన్ సెట్‌ల తయారీని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకలకు ఆల్‌స్ట్రాం ఇండియా, దక్షిణాసియా విభాగాల మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్పోర్ నేతృత్వం వహించారు. టెస్టింగ్ అనంతరం మొదటి మెట్రో ట్రయిన్‌ను నవంబర్ 2020కు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముంబయ్ మెట్రోరైలు కోసం ఆల్‌స్ట్రాం చేసుకున్న మొత్తం ఒప్పందం విలువ రూ.452 మిలియన్‌ల యూరోలని, ఈ ఆర్డర్‌లో 8 బోగీలు కలిగిన 31 తేలికపాటి పూర్తి సర్వీస్‌తో అధునాతన మెట్రోట్రెయిన్‌లు ఉం టాయని, ఉత్పత్తితో పాటు విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని కూడా అమలుచేయనుందని తెలిపా రు. అత్యాధునిక మెట్రో ట్రెయిన్‌లో అథారిటీ ఇం టర్ లాకింగ్ కేంద్రీకృత రైలు పర్యవేక్షణ సీసీటీవీ ప్రయాణీకుల సమాచారం, రైళ్లరాకపోకల ప్రకటనతో కూడిన సమగ్ర టెలికాం పరిష్కరణ ఎలక్ట్రికల్, మెకానికల్ పర్యవేక్షణ నియంత్రణ ఇందులో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈసందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్‌స్పోర్ మాట్లాడుతూ భారతదేశ వాణిజ్యరాజధానిలో రవాణాకు సరికొత్త రూపాన్ని అందించనుందని ముంబయ ఒక ప్రపంచ స్థాయి నగరం, అందుకు అనుగుణంగా అధునాతన మెట్రోరైలు అనుభవాన్ని అందుకునేందుకు సిద్దంగా ఉందని ప్రయాణీకుల అవసరాల కోసం ప్రత్యేక సామర్థ్యం, సాంద్రత మధ్య ఉన్న అంతరాలను భర్తీచేసేందుకు ఈ అధునాతన మెట్రో ట్రెయిన్ ఉపయోగపడుతుందని తెలిపా రు. ఈ ట్రెయిన్‌లో ఒక ట్రిప్‌కు సుమారు 3000 మంది ప్రయాణించేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ముంబయ్‌వాసుల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని వివరించారు. శ్రీసిటీలోని మెట్రో ట్రెయిన్ ఉత్పత్తికేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని రెట్టింపుచేసేందుకు ఏటా 240 నుంచి 480 రైళ్లను తయారుచేసేందుకు శ్రమిస్తున్నామని, ప్రస్తుతం చెన్నై మెట్రో, మాంట్రియల్ మెట్రో, ముంబై మెట్రో రైలు, సిడ్నీమెట్రో రైలు నుంచి వచ్చిన ఆర్డర్‌లకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా పాల్గొన్నారు.
*చిత్రం... ముంబై మెట్రో రైలు నమూనాను ప్రారంభిస్తున్న దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్‌స్పోర్