బిజినెస్

మధుమేహానికి పనాసియా నుంచి జనరిక్ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఔషధ పరిశ్రమలో పేరొందిన పనాసియా బయోటెక్ కంపెనీ మదుమేహానికి కొత్త జనరిక్ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది. విల్‌యాక్ట్ బ్రాండ్ పేరుతో తయారైన ఈ మం దును టైప్-2 డయాబెటిస్‌కు వాడతారు. ఇందులో విల్డాగ్లిప్టిన్ 50 ఎంజీ, విల్డాప్లిప్టిన్ 50 ఎంజీ, మెట్‌ఫార్మిన్ హెచ్‌సీఎల్ 850 ఎంజీ, విల్డాగ్లిప్టిన్ 50 ఎంజీ, మెటఫార్మిన్ హెచ్‌సీఎల్ 1000 ఎంజీ ఉంటాయి. కాగా, తమ ఉత్పత్తుల్లో ఒకటైన విల్డాగ్లిప్టిన్‌కు ఉన్న పేటెంట్ సోమవారంతో ముగిసిందని, అందుకే కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశామని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. విల్‌యాక్ట్ బ్రాండ్‌ను డియాకార్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్‌బీయూ) ఈ ఔషధాన్ని అధికారికంగా విడుదల చేసినట్టు తెలిపింది. భారత దేశంలో ఔషధ మార్కెట్‌లో మరింతగా విస్తరించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలిపింది.