బిజినెస్

చలికాలమైనా..పెరుగుతున్న కూలింగ్ పరికరాల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓ వైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నా కూలింగ్ పరికరాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. 2019 నుంచి 2030 మధ్య కాలంలో 4.8 బిలియన్ల కొత్త కూలింగ్ యూనిట్లు, పరికరాల విక్రయం జరిగే అవకాశాలున్నాయని ఏకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అధ్యయన నివేదిక బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వినియోగం ఏకాలంలోనైనా స్థిరంగా వృద్ధి చెందుతోందని నివేదించింది. ఐతే వ్యర్థాలతో వాతావరణ కాలుష్యానికి దారితీసే పాత కూలింగ్ పరికరాల స్థానంలో కొత్తపరికరాల వినియోగం జరగాల్సివుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూలింగ్ పరికరాలకు పెరుగుతున్న డిమాండ్‌లో చైనాకు అధిక భాగస్వామ్యం ఉందని, అలాగే భారత్, ఇండోనేషియాల్లోనూ వేగంగా ఈ వినియోగం పెరుగుతోందని తెలిపింది. పట్టణీకరణతోబాటు తలసరి ఆదాయం పెరగడం ఇందుకు దోహదం చేస్తోందని తెలిపింది. నివాస గృహాలు అవసరాలకే 60 శాతం వినియోగం జరుగుతోందని, స్థిరాస్తి వ్యాపారులు కూడా ఈ డిమాండ్‌కు ఊతాన్నిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఐతే ఈ వినియోగం వృద్ధిచెందేకొద్దీ వాతావరణ పరమైన కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని, ఈ కూలింగ్ పరికరాలు వెలువరించే వ్యర్థాలు ఇందుకు కారణభూతం అవుతాయని హెచ్చరించింది. ఈప్రమాదం తలెత్తకుండా చూడాలంటే తక్కువ వ్యర్థాలు వెలువరించే కూలింగ్ పరికరాలకు మారడం వంటివి చేయాలని కేసీఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాన్ హంజాగుడ్‌కేర్ సూచించారు.