బిజినెస్

మార్కెట్లకు ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 172.69 పాయింట్లు మెరుగుపడి, 40,412.57 పా యింట్లకు చేరింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎస్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 53.35 పాయింట్లుగా లాభపడి 11,910.15 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం మాదిరిగానే బుధవారం కూడా ఎస్ బ్యాంక్ షేర్ల ధరలు దారుణంగా పడిపోవడం గమనార్హం. అటు బీఎస్‌ఈలో, ఇటు ఎన్‌ఎస్‌ఈలో అదే పరిస్థితి తలెత్తింది. బీఎస్‌ఈలో ఈ బ్యాంక్ వాటా లు 15.33 శాతం పతనమయ్యాయి. నికర ఉత్పత్తి తగ్గినట్టు బ్యాంకు నివేదిక స్పష్టం చేయడంతో మదుపరులు షేర్ల అమ్మకాలపై మొగ్గుచూపారు. కాగా, వేదాంత 1.63 శాతం, హీరో మోటార్స్ 1.44 శాతం, ఎల్ అండ్ టీ 1.21 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.17 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. లాభాలను ఆర్జించిన సంస్థల్లో ఎన్‌టీపీసీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ షేర్లు 2.77 శాతం లాభాలను సంపాదించాయి. ఓఎన్‌జీసీ 2.28 శాతం, టెక్ మ హీంద్ర 1.97 శాతం, కొటక్ మహీంద్ర 1.62 శాతం, టీసీఎస్ 1.43 శాతం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎస్ బ్యాంక్ షేర్ల పతనం వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. షేరు విలువ 13.85 శాతం పతనం కావడం గమనార్హం. హీరో మోటార్స్ 1.85 శాతం, వేదాంత 1.28 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.26 శాతం, హిందాల్‌కో 1.26 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, గెయిల్ అత్యధికంగా 5.31 శాతం లాభాలను నమోదు చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు దక్కుతుంది. ఆ కంపెనీ షేర్లు 4.85 శాతం లాభాలను ఆర్జించాయి. ఎన్‌టీపీసీ 2.86 శాతం, ఐఓసీ 2.73 శాతం, ఓఎన్‌జీసీ 2.24 శాతం చొప్పున లాభాలు సంపాదించా యి. అంతర్జాతీయ సూచీలతోపాటు ఆసియా ఇండెక్స్ కూడా సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ నష్టాల నుంచి బయటపడింది.