బిజినెస్

ఆరంభ ఇస్యూతోనే అదరగొట్టిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఉజ్టివాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో గురువారం ఆరంభ ఇస్యూతోనే అదరగొట్టింది. రూ. 37 ధరతో విడుదలైన ఈ ఇస్యూ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఏకంగా 57 శాతం బలపడింది. ఒక దశలో రూ. 53.10కి దిగివచ్చినప్పటికీ చివరికి రూ. 55.90గా స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ ఇస్యూ రూ. 58.75తో మొదలై ఇంట్రాడేలో రూ. 62.80కి చేరింది. చివరిగా 5.87 శాతం తగ్గుదలతో రూ. 55.30 వద్ద స్థిరపడింది. ఈ కంపెనీకి చెందిన మొత్తం 1.61 కోట్ల వాటాలు బీఎస్‌ఈలో ట్రేడవగా, 25.14 కోట్ల యూనిట్లు ఎన్‌ఎస్‌ఈలో ఒక్కరోజులోట్రేడయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ బీఎస్‌ఈ లో రూ. 9,660.77 కోట్లకు పెరిగింది. తొలుత కేవలం ఉజ్జీవన్ ఫైనాన్షియల్ కంపెనీగా ఆవిర్భవించిన ఈ కంపెనీ తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌గా మారింది. తాజాగా దిగువ స్థాయి మార్కెట్ కస్టమర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా రూపాంతరం చెందింది. చిన్న ఫైనాన్స్ కంపెనీల్లో ఈ బ్యాంకు లీడింగ్‌గా మారే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.