బిజినెస్

తగ్గుతున్న ఉల్లి దిగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఉల్లిగడ్డ కొరత యావత్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని విమర్శలు, వ్యాఖ్యలు, జోకులు పుట్టుకొస్తునే ఉన్నా యి. అయితే, కొరత ఉన్నప్పటికీ, ఇటీవల కాలం లో ఉల్లి దిగమతి గణనీయంగా తగ్గడాన్ని శుభవార్తగానే చెప్పుకోవాలి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.8.42 కోట్ల విలువైన ఉల్లి దిగుమతి అయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.11.88 కోట్ల తమేర దిగుమతి జరిగిందంటే, గత ఏడాది ఎంత తగ్గిందో ఊహించడం కష్టం కాదు. నిజానికి 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.1.35 కోట్ల విలువైన దిగుమతి జరిగింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ, 2013.14 ఆర్థిక సంవత్సరం నాటికి 33.41 కోట్లకు చేరింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎవరూ ఊహించని రీతిలో 361.98 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆతర్వాత మళ్లీ తగ్గడం ప్రారంభమైంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా ఉల్లి దిగుమతి తగ్గగా, దేశీయ ఉత్పత్తి పెరిగింది. ఇటీవల నెలకొన్న కారణంగా ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు జారీ చేయడం తెలిసిందే.