బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 14: ఈవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ)లో సెస్సెక్స్ 564.56 పాయింట్లు, ఇటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 334.34 పాయింట్లు మెరుగుపడ్డాయి. 40,445.15 పాయింట్లతో ఈవారం ట్రేడింగ్‌కు తొలిరోజైన సోమవారం ప్రారంభమైన మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 42.28 పాయింట్లు లాభపడి, 40,487.43 పాయింట్లకు చేరగా, 16 పాయింట్లు మెరుగైన నిఫ్టీ 11,937.50 పాయింట్లుగా నమోదైంది. అయితే, మరుసటి రోజు, మంగళవారం నష్టాలను చవిచూడడంతో మార్కెట్ల పరిస్థితి ఎటు నుంచి ఎటు వెళుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సెనె్సక్స్ ఏకంగా 247.55 పాయింట్లు పతనమై 40,239.88 పాయింట్లకు, నిఫ్టీ 80.70 పాయింట్లు నష్టపోయి 11,850.80 పాయింట్లకు పడిపోయాయి. మదుపరుల్లో, స్టాక్ బ్రోకర్లలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, బుధవారం స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలబాట పట్టాయి. సెనె్సక్స్ 172.69 పాయింట్లు లాభపడడంతో 40,412.57 పాయింట్లకు చేరింది. నిప్టీ 11,910.15 పాయింట్ల లాభంతో 11,910.15 పాయింట్లకు ఎదిగింది. బుధవారం కూడా లాభాలు కొనసాగాయి. సెనె్సక్స్ 169.14 పాయింట్లు లాభాలను ఆర్జించి, 40,581.71 పాయింట్లకు, నిఫ్టీ 61.65 పాయింట్లు లాభపడి 11,971.80 పాయింట్లకు చేరాయి. లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. సెనె్సక్స్ 41 వేల మైలురాయిని, నిఫ్టీ 12 వేల మైలురాయిని అధిగమించాయి. 428 పాయింట్లు లాభాలను ఆర్జించడంతో సెనె్సక్స్ 41,009.761 పాయింట్లకు దూసుకెళ్లింది. అదే విధంగా 114.90 పాయింట్లు లాభాలను నమోదు చేసిన నిఫ్టీ 12,086.70 పాయింట్ల వద్ద ముగిసింది. కంపెల పరంగా చూస్తే, సోమవారం నాటి మార్కెట్‌లో యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ అదానీ పోర్ట్స్, మారుతీ సుజికీ షేర్లు లాభాల్లో ట్రేడైతే, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, ఎల్ అండ్ టీ, జీ ఎంటర్‌టైనె్మంట్ నష్టాలను ఎదుర్కొన్నాయి.
మంగళ వారం నుంచి బుధ వారం వరకూ వరుసగా మూడు రోజుల పాటు ఎస్ బ్యాంక్ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మంగళవారం ఈ కంపెనీ బీఎస్‌ఈలో 10.05 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 10.40 శాతం చొప్పున నష్టపోయింది. బుదవారం బీఎస్‌లో 15.33 శాతం, ఎన్‌ఎస్‌సీలో 13.85 శాతం నష్టాల్లో ఈ బ్యాంక్ షేర్లు ట్రేడయ్యాయి. ఇతరత్రా అంశాలను గమనిస్తే, బజాజ్ ఫిన్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్ర, కోటక్ మహీంద్ర తదితర కంపెనీల షేర్లులాభాల్లో నడిచాయి. మిగతా కంపెనీలు చెప్పుకోతగ్గ లాభాలను ఆర్జించలేదు. కొన్ని నష్టాల్లో మునిగాయి. మొత్తం మీద అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడంతో, ఈవారం స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు ఆశాజనకంగానే కొనసాగాయి. ముందుగా ఊహించిన విధంగానే లాభాలను నమోదు చేశాయి. కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపన అంశాలను ప్రకటించడం కూడా స్టాక్ మార్కెట్లకు ఊతన్నిచ్చాయి.