బిజినెస్

గృహ నిర్మాణ రంగ విక్రయాల్లో 4 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈ ఏడాది గృహ నిర్మాణ రంగ విక్రయాల్లో 4 శాతం వృద్ధి చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మొత్తం 2.58 లక్షల యూనిట్ల యూనిట్లు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జరిగే అవకాశాలున్నాయి. ఒక వైపు ద్రవ్యలోటు, డిమాండ్ తగ్గుదల, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్య ఇక్కట్లున్నా ఇలా పెరుగుదల నమోదవడం విశేషమని ఆదివారం నాడిక్కడ విడుదలైన స్థిరాస్తి బ్రోకరేజ్ సంస్థ ‘అనారోక్’ అధ్యయన నివేదిక పేర్కొంది. ఆ సంస్థ చైర్మన్ గనురాగ్ పూరీ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది రెండో త్రైమాసికానికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఐతే 2019లో నాలుగు త్రైమాసికాల్లోనూ హౌసింగ్ సేల్స్‌లో స్థిరమైన వృద్ధి చోటుచేసుకుని 2,58,410 యూనిట్లకు చేరే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాది జరిగిన 2,48,300 యూనిట్ల విక్రయాలకన్నా ఇది 4 శాతం అదనమని వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో అమ్మకాలు పుంజుకున్నప్పటికీ మూడో త్రైమాసికంలో డిమాండ్ తగ్గిందని అనురాగ్ పూరీ వివరించారు. ప్రధానంగా ముంబయి, మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), దేశ రాజధాని రీజియన్ (ఎన్‌సీఆర్), బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో ఈ హౌసింగ్ విక్రయాలు గణనీయ వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు.