బిజినెస్

స్మార్ట్ టీవీల తయారీ రంగంలోకి మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ త్వరలో షియోమీ, మోటొరోలా, ఒన్‌ప్లస్ తరహాలో స్మార్ట్ టెలివిజన్ల తయారీని చేపట్టనుంది. 2020 ప్రథమార్థంలో ఈ టెలివిజన్లు భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తమ సంస్థ ఇతర వాణిజ్య విభాగాల్లోకి ప్రవేశిస్తోందని, టెలివిజన్ల తయారీతో స్మార్ట్ యాక్సససరీస్ వాణిజ్యంలోకి అడుగిడుతున్నామని ఇన్ఫ్‌నిక్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిష్ కపూర్ ఆదివారం నాడిక్కడ పీటీఐకి తెలిపారు. ఐతే ఆ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన విశిష్టతలను ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ తొలుత స్మార్ట్‌టీవీలను విడుదల చేసే మార్కెట్లలో భారత్‌కూడా ఒకటని ఆయన స్పష్టం చేశారు. అటు సాఫ్ట్‌వేర్‌తోబాటు హార్డ్‌వేర్ విభాగంలోనూ వాణిజ్యాన్ని విస్తరించాలని తమ సంస్థ భావిస్తోందని, ఆ దిశగానే పావులు కదుపుతున్నామని వివరించారు. కాగా చైనాకు చెందిన ‘ట్రాన్షన్ గ్రూపు’లో ఒకటైన ఇన్ఫినిక్స్ ప్రధానంగా రూ. 10 వేల స్మార్ట్ఫోన్ల వాణిజ్యాన్ని భారత మార్కెట్లో విస్తరించడంపై దృష్టి నిలిపిందని కపూర్ చెప్పారు. ఇప్పటికే భారత మార్కెట్లోకి పలు బ్రాండ్ల స్మార్ట్ టీవీలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ దేశంలో విస్తారమైన మార్కెట్ అవకాశాలున్నాయని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో మొబైల్ ఫోన్ల తయారీకే పరిమితమైన షియోమీ, సామ్‌సంగ్, ఎల్‌జీ, మైక్రోమాక్స్, మోటొరోలా టెలివిజన్ తయారీలోకి రాగా పీమియమ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ బంద్‌వేగన్‌తో కలిసి రెండు ప్రీమియం స్మార్ట్ టెలివిజన్ మోడల్స్ తయారీ చేస్తోంది. ఇవి ప్రస్తుతం భారత మార్కెట్లో మాత్రమే లభిస్తున్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నోకియా టెలివిజన్‌ను ఆన్‌లైన్ విక్రయాల్లో ప్రవేశపెట్టింది. ఈక్రమంలో భారత్‌లో ప్రతియేటా 12.5 మిలియన్ యూనిట్ల టెలివిజన్ మార్కెట్ జరుగుతోందని అంచనా. ఇందులో సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ మాత్రమే నాలుగింట మూడొంతుల మార్కెట్‌ను కైవసం చేసుకున్నట్టు అంచనా.