బిజినెస్

నేటి నుంచే.. కేంద్ర బడ్జెట్ కోసం సంప్రదింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి సంప్రదింపులను ఆరంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సంబంధిన వివరాలను వివిధ వర్గాల నుంచి సమీకరించనున్నారు. ప్రధానంగా పారిశ్రామిక రంగ ప్రముఖులతోబాటు, మాజీ సంస్థల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఆమె చర్చలు జరుపనున్నారని అధికావర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దేశంలో వినిమయాన్ని పెంచి తద్వారా ఆర్థికాభివృద్ధి చోటుచేసుకునేలా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆమె కూలంగా చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే 2020 ఫిబ్రవరి 1న నిర్మల తన రెండో బడ్జెట్ ప్రతిపాదనలను మోదీ 2.0 ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ఈక్రమంలో సోమవారం నుంచి ఆరంభం కానున్న బడ్జెట్ సంప్రదింపులు ఈనెల 23 వరకు సాగుతాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి చేరుకున్న దృష్ట్యా ఈ దఫా దేశ ఆర్థికాభివృద్ధి అంశాలపైనే ఈ సంప్రదింపులు సాగుతాయని స్పష్టం చేశాయి. సోమవారం ప్రత్యేకించి ‘సరికొత్త ఆర్థికాభివృద్ధి అంకురాలు’, ‘్ఫన్‌టెక్, డిజిటల్ రంగాలు’ అనే అంశాలపైనే ఆర్థిక మంత్రి అభిప్రాయ సేకరణ జరుగుతుందని అధికారులు తెలిపారు.
*చిత్రం... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్